మొటిమలు.. సౌందర్యపరంగా అమ్మాయిలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండచ్చు. కొందరికి ఇవి మరీ అధిక సంఖ్యలో ఉండడమే కాకుండా కాస్త పెద్ద పరిమాణంలో ఉంటూ నొప్పి, వాపు వంటివి కనిపిస్తాయి. ఇంకొందరికి కాస్త తక్కువ సంఖ్యలోనే ఉంటాయి. మరికొందరికి చిన్న పరిమాణంలో అక్కడక్కడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి వారిలో మొటిమల చుట్టూ వాపు రావడం, నొప్పి కలగడం.. వంటి సమస్యలేవీ అంతగా కనిపించవు. అయితే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం ద్వారా వీటి నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందచ్చు.
టూత్‌పేస్ట్..

మొటిమలపై వేలికొనల సహాయంతో నేరుగా టూత్‌పేస్ట్ అప్త్లె చేసి అరగంట పాటు ఉంచాలి. లేదా అది పూర్తిగా ఆరేంత వరకు వేచి ఉండవచ్చు. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకొని మైల్డ్ ఫేస్‌వాష్ ఉపయోగించి ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా మొటిమల చుట్టూ ఉండే చీము త్వరగా తగ్గుముఖం పట్టి వాపు తగ్గుతుంది. అలాగే టూత్‌పేస్ట్‌లో ఉండే ట్రైక్లోసాన్ మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాతో పోరాడి అవి పూర్తిగా తగ్గిపోయేలా చేస్తుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే మొటిమలపై ఇది చక్కని ప్రభావం చూపిస్తుంది.
వెల్లుల్లి..

వెల్లుల్లి రెబ్బ ఒకటి తీసుకొని దానిని మధ్యభాగంలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన సగభాగాన్ని మొటిమపై వెల్లుల్లి రసం అందేలా మృదువుగా రుద్దుకోవాలి. ఇలా పావుగంట పాటు చేసిన తర్వాత మరో పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ చిట్కాతో తక్కువ సమయంలో సమస్య తగ్గుముఖం పట్టాలంటే మాత్రం నిర్ణీత వ్యవధికోసారి మళ్లీ మళ్లీ ఇలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే దాని ప్రభావం కనిపిస్తుంది.
ఉల్లిరసం..
మొటిమల చుట్టూ ఉండే ఎర్రదనం, వాపు వంటి సమస్యలు తగ్గుముఖం పట్టించడంలో ఉల్లిరసం ముందువరుసలో ఉంటుంది. రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న ఉల్లిముద్దని వడపోయడం ద్వారా ఉల్లిరసం మనకు లభిస్తుంది. అందులో ఒక కాటన్ బాల్ని ముంచి మొటిమలపై మృదువుగా అద్దుకోవాలి. ఆ తర్వాత వాటిని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనిచ్చి ముఖం శుభ్రం చేసుకోవాలి. మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖం కడుకున్న తర్వాత చర్మానికి తప్పనిసరిగా మాయిశ్చరైజర్ కూడా రాసుకోవాలి.
ఐస్‌క్యూబ్..

మొటిమల చుట్టూ ఉండే ఎర్రదనం, వాపు.. వంటి సమస్యలను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడే వాటిలో ఐస్‌క్యూబ్ కూడా ఒకటి. వీటిని ఒక మెత్తని క్లాత్‌లో వేసి దాంతో మొటిమలు ఉన్న చోట మెల్లగా కొద్ది సెకన్ల పాటు అద్దుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేయడం ద్వారా మొటిమలు త్వరగా తగ్గుముఖం పడతాయి. అయితే ఇందుకు సాధారణ ఐస్‌క్యూబ్స్ కాకుండా గ్రీన్ టీతో తయారుచేసినవైతే ఇటు మొటిమలు తగ్గుముఖం పట్టడంతో పాటు చర్మం కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది.
వేపాకులు, నిమ్మరసం..

వేపాకులు, నిమ్మరసం.. ఈ రెండూ మొటిమలు తగ్గుముఖం పట్టేందుకు చాలా బాగా పని చేస్తాయి. అయితే వాటిని విడివిడిగా ఉపయోగించడం కాకుండా రెండింటినీ కలిపి ప్రయత్నించడం ద్వారా తక్కువ సమయంలో ప్రభావవంతమైన ఫలితం కనిపించే అవకాశాలున్నాయి. ఇందుకోసం కొద్దిగా వేపాకులు తీసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో కాస్త నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసి 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరి!
ఇవీ ఉపయోగకరమే..!

* కోడిగుడ్డులోని తెల్లసొనని మొటిమలపై అప్త్లె చేసి ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. * పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి ఆ పేస్ట్‌ని మొటిమలు ఉన్నచోట అప్త్లె చేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. * మొటిమలు ఉన్నచోట దూదితో టీ ట్రీ ఆయిల్ అప్త్లె చేసి కాసేపు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. * టొమాటో గుజ్జుని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకొని అరగంట పాటు ఆరనిచ్చి శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా మొటిమలు తగ్గడంతో పాటు చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిట్కాలో టొమాటోకి బదులుగా బొప్పాయిని కూడా ఉపయోగించవచ్చు. * బంగాళాదుంపని గుండ్రని, సన్నని పొరల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఒక లేయర్ తీసుకొని దాంతో ముఖ చర్మంపై మృదువుగా రుద్దుకోవాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
|
ఈ చిట్కాలు పాటించడంతో పాటు నూనె, మసాలాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం, ఎక్కువగా నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే మొటిమలను పదేపదే చేతితో తాకడం, వాటిని చిదిమేయడానికి ప్రయత్నించడం.. వంటివేవీ చేయకూడదు.